Site icon NTV Telugu

Rajahmundry: చంద్రబాబు పేరుతో సర్క్యులేట్ అవుతున్న లెటర్ జైలు నుంచి వచ్చింది కాదు

Jail

Jail

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరుతో సర్క్యూరేట్ అవుతున్న లెటర్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చంద్రబాబు పేరుతో సర్కులేట్ అవుతున్న లెటర్ జైలు నుండి వచ్చింది కాదు అని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన లెటర్ లు పంపాలంటే ముందు అధికారులు పరిశీలిస్తారు అని జైలు జైలు సూపరిండెంట్ రాహుల్ వెల్లడించారు. సంబంధిత జైలర్ ధ్రువీకరించి సంతకం చేసి స్టాంప్ వేసి బయటకు పంపించడం జరుగుతుంది.. చంద్రబాబు పేరుతో సర్క్యూరేట్ అవుతున్న లెటర్ కు, జైలుకు ఏ విధమైన సంబంధము లేదు అని సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు.

Read Also: Reece Topley: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రపంచకప్ నుండి ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ ఔట్

అయితే, అంతకు ముందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఓ లేఖ విడుదల అయింది. ఆ లేఖలో నేను జైలులో లేను.. మీ అందరి గుండెల్లో ఉన్నాను.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను అని ఆయన తెలిపారు. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో నేను ఉన్నాను.. ప్రజలే నా కుటుంబం.. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది అని చంద్రబాబు అన్నారు.

Jail.

Exit mobile version