Director Maruthi: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “రాజా సాబ్”. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని సక్సెస్ పుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతుంది. డైరెక్టర్ మారుతి టేకింగ్, గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్‌ను ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి షేర్ చేసుకున్నారు. ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఆయన ఏం నేర్చుకున్నారో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
READ ALSO: Maruthi: చిరంజీవితో సినిమాపై డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్..
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసాబ్ సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోందని అన్నారు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ అని, ఎలాగైనా చంపొచ్చని, కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం అని చెప్పారు. రాజా సాబ్ లాంటి సినిమా చేయడం సులువు కాదని చెప్పారు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం అని, ఆయన సబ్ కాన్షియస్ మైండ్‌ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలని చెప్పారు. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్‌లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డామని వెల్లడించారు.
తాను ఈ సినిమా ద్వారా ఒక పెద్ద స్టార్‌తో కూడా సినిమా బాగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నానని చెప్పారు. సీజీ వర్క్స్ విషయంలో కూడా కొన్ని నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రతిరోజు పండగే సినిమాను 40 రోజుల్లో రాసిన నేను…ఈ చిత్రంలో కొన్ని సీన్స్ కోసం రెండు నెలల టైమ్ తీసుకున్నానని తెలిపారు. అలా రాజా సాబ్ సినిమా తనకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని చెప్పారు. ప్రభాస్ గారి అభిమానులు తనకు సోదరులు అని చెప్పారు. వారే ఫోన్స్, మెసేజ్‌లు చేస్తూ అభినందిస్తున్నారని, ప్రభాస్ గారిని కొత్తగా ప్రెజెంట్ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది తనకు పర్సనల్‌గా విష్ చేశారని, నాగ్ అశ్విన్, సందీప్ వంగా రాజా సాబ్ కు సపోర్ట్ చేశారని వెల్లడించారు.
READ ALSO: Anil Ravipudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో చాలా షాకింగ్ థింగ్ ఇదే..: అనిల్ రావిపూడి
