NTV Telugu Site icon

Raj Tarun Lavanya Case: హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..

Raj Tarun Lavanya Case

Raj Tarun Lavanya Case

Raj Tarun Parents Filed Case on Lavanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు జరుగుతున్న గాని.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరుగుతున్న విషయమే అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ప్రతిరోజు ఓ కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. అచ్చం సినిమాలు స్టోరీ వలె నిజజీవితంలో కూడా అంతకుమించి రోజు రోజుకి కొత్త ట్విస్టులతో వీరి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు రాజ్ తరుణ్ ప్రియురాలినని చెబుతున్న లావణ్య పై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సర్వర్త చర్చనీయాంశం అవుతుంది.

Wayanad Landslides : వాయనాడ్‌లో రెస్క్యూను వేగవంతం చేసేందుకు బెయిలీ బ్రిడ్జీ నిర్మించిన సైన్యం

హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులైన బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం నాడు లావణ్య పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీరు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుండగా వారింటికి వెళ్లిన లావణ్య అక్కడ గొడవ చేసిందని సమాచారం. తమ ఇంటి వద్ద ఆవిడ తలుపులను పెద్దగా బాధి.. అక్కడ న్యూసెన్స్ సృష్టించిందని., అలాగే తమపై దాడికి ప్రయత్నం చేయడానికి వచ్చిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమెపై పోలీస్ లకు ఫిర్యాదు అందించారు. ముందే తమకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నామని.. ఇప్పుడు లావణ్య వల్ల మాకు ప్రాణహాని ఉన్నట్టు వారు పేర్కొన్నారు.

IND vs SL: నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?

ఈ విషయం సంబంధించి హీరో రాజ్ తరుణ్ లాయర్ మాట్లాడుతూ.. ఇదివరకు లావణ్యకు నేర చరిత్ర ఉందని.. ఆమె వల్ల రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలిపారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ కు హైబీపీతో పలు సమస్యలు ఉన్నాయని.. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో లావణ్య వారిపై ఎలాంటి దాడి కైనా ప్రయత్నించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక రాజ్ తరుణ్ విషయంలో ఆవిడ వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయన పేరెంట్స్ ని బెదిరించిందని., అలాగే వారికి పోలీసు ప్రొటక్షన్ కావాలంటూ అడిగినట్లు సమాచారం. ఇక రాజ్ తరుణ్ దగ్గర కూడా అనేక ఆధారాలు ఉన్నాయని., అందుకు సంబంధించి తాము కూడా న్యాయపరంగా పోరాడుతామని లాయర్ తెలిపారు. ఇకపోతే గురువారం నాడు లావణ్య రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకొనే శేఖర్ భాషాని చెప్పుతో కొట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Show comments