NTV Telugu Site icon

Raj Tarun Case : న్యాయపోరాటం కొనసాగిస్తా.. వీలైతే ఆమరణ దీక్షకు సిద్ధం అంటున్న లావణ్య

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

Raj Tarun Case : లావణ్య-రాజ్ తరుణ్ ల వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లకు పైగా నాతో సహజీవనం చేసిన రాజ్ తరుణ్ ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ ఉన్న రాజ్ తరుణ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మాకు పెళ్ళైంది. రెండు సార్లు అబార్షన్ అయ్యిందని లావణ్య ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు అందించిన పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మాల్వీ మల్హోత్రా సోదరుడిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి లావణ్య సూసైడ్ చేసుకుంటానని తన అడ్వకేట్‌తో చేసిన చాటింగ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్‌కు మెసేజ్ చేసింది. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను అంటూ తన అడ్వకేట్‌కు చేసిన మెసేజ్ లో లావణ్య పేర్కొంది.

Read Also:Kalki collections : బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర…రూ.1000కోట్ల క్లబ్‌లో ప్రభాస్..?

ఈ క్రమంలోనే లావణ్య మీడియాతో మాట్లాడుతూ..‘ నా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తా .. రేపు MAA అసోసియేషన్ ను వెళ్ళి కలుస్తా… వీలైతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమే.. నేను మొదటి సారి ఫిర్యాదు చేస్తే.. ఫార్మాట్ లో లేదు అన్నారు. రెండో సారి ఆధారాలు అడిగారు. 170 ఫోటోలు, వీడియోలు ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేశా… ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇచ్చారు. ఇప్పటికీ రాజ్ తరుణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కేసు వెనక్కి తీసుకోమని ఎవరెవరో నన్ను బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉంది. నాకు నా రాజ్ కావాలి.. రాజ్ తరుణ్ నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also:Raj Tarun Case : రాజ్‌ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్.. ఎంట్రీ ఇచ్చిన మరో అడ్వకేట్ ?

Show comments