NTV Telugu Site icon

Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‎లో మహిళల ఆందోళన

Afghanistan Women

Afghanistan Women

Afghanistan Women: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. వారి హక్కులు హరించబడ్డాయి. వారిపై రకరకాల ఆంక్షలు విధించారు. చదువుపై నిషేధం, దుస్తులపై నిషేధం ఇలా వారిని చీడపురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ హస్తకళల మార్కెట్ భారీగా తగ్గుతోందని ఆఫ్ఘన్ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండేళ్లుగా హస్తకళల మార్కెట్‌లో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని చాలా మంది మహిళలు చెబుతున్నారు. ఈ మహిళలు మార్కెట్‌ను పెంచడానికి సంబంధిత సంస్థల నుండి మద్దతు కోరారు. ఆఫ్ఘన్‌కు చెందిన మహిళా పెట్టుబడిదారు రోఖ్‌సర్ తాలిబాన్‌ల సహాయం కోరింది. రోఖ్‌సర్‌కు హస్తకళలో నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.

మహిళలకు మద్దతు ఇవ్వాలి- రోఖ్‌సర్
రోఖ్‌సర్‌ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి మరింత అభివృద్ధి చెందేలా వారికి అండగా ఉండాలని అన్నారు. ఆగస్ట్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆక్రమించినప్పటి నుండి, వారి వ్యాపారం క్షీణించిందని వ్యాపారవేత్త బెనాఫ్షా చెప్పారు. ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అమ్మకాలు తగ్గాయని బెనాఫ్‌షా తెలిపింది. వారు మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేయటం లేదు. అలాగే ఎయిర్ కారిడార్లను మూసివేయడం వల్ల వారి ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడం లేదు.

Read Also:School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం

హామీ ఇచ్చిన తాలిబన్లు
తాలిబాన్ నేతృత్వంలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అఖుంద్జాదా అబ్దుల్ సలామ్ జవాద్ మాట్లాడుతూ.. వ్యాపార మహిళలకు సహాయం చేయడానికి తాలిబాన్ కట్టుబడి ఉందని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. హస్తకళల వ్యాపారంలో నిమగ్నమైన మహిళలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని జవాద్ చెప్పారు.

మహిళల కోసం హస్తకళల మార్కెట్‌
మహిళల హస్తకళల కోసం దేశం లోపల, వెలుపల మార్కెట్‌లను సృష్టిస్తున్నాం, తద్వారా వారు దేశ వాణిజ్య రంగంలో శక్తివంతమైన భాగంగా గణనీయమైన సహకారం అందించగలరు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్, లఘ్‌మన్, కునార్, నూరిస్తాన్, హెరాత్, కాబూల్‌తో సహా 16 ప్రావిన్సులలో మహిళా వాణిజ్య సంస్థలు తెరిచి ఉన్నాయని ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది.

Read Also:Balayya : బాలయ్య కెరీర్ ను మలుపు తిప్పిన ఆ సినిమా..?

Show comments