Raipur Nude Party: కాలంతో పాటు మనుషుల తీరు కూడా మారుతుంది. నిజం అండీ బాబు.. ఎక్కడైనా విన్నారా ఇప్పటి వరకు ఇండియాలో న్యూడ్ పార్టీ గురించి. కానీ జరిగింది. ఎక్కడ అనుకుంటున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో. ఈ న్యూడ్ పార్టీ నిర్వహించిన నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఇప్పటికే 5 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
READ ALSO: Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
రాయ్‌పూర్‌లోని హైపర్ క్లబ్‌లో గబ్బు పని..
ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. దీని సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నగ్న జంటలకు ఆహ్వానాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ విషయంపై నిరసనలు పెరగడంతో పాటు, రాష్ట్రంలోని ప్రముఖ నాయకులు ప్రకటనలు విడుదలైన తర్వాత, పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకులు సోషల్ మీడియా, ప్రైవేట్ గ్రూపుల ద్వారా ప్రజలను ఈ న్యూడ్ పార్టీకి జంటలను ఆహ్వానించారు. పార్టీ థీమ్ వచ్చేసి నగ్నంగా ఉండటం.. ఇది చట్టానికి విరుద్ధమని, దీనిపై కాంగ్రెస్ కార్యకర్తల బృందం ఫిర్యాదుతో పోలీసులను కేసు నమోదు చేశారు. తర్వాత క్రైమ్ బ్రాంచ్ బృందం కార్యక్రమం జరగనున్న రాయ్‌పూర్‌లోని హైపర్ క్లబ్‌పై దాడికి ప్రణాళిక వేసింది. అయితే కార్యక్రమం ప్రారంభం కాకముందే నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాయ్‌పూర్‌లోని హైపర్ క్లబ్‌లోని న్యూడ్ పార్టీ, స్ట్రేంజర్ హౌస్ పార్టీ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విషయాన్ని సీరియస్‌గా తీసుకొని క్లబ్ ఆపరేటర్ జేమ్స్ బెక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు, ఇతర యువకులను కూడా ప్రశ్నిస్తున్నామన్నారు. తాను స్వయంగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 21న జరగనున్న ‘స్ట్రేంజర్ హౌస్ పార్టీ’పై దర్యాప్తు చేస్తున్నట్లు, ఇప్పటికే ఆ కార్యక్రమ నిర్వాహకుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
READ ALSO: Russia: ప్రపంచాన్ని నివ్వెరపరిచిన రష్యా.. హైపర్‌సోనిక్ క్షిపణి సక్సెస్
