Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది. దీంతో పాటు నేడు (మంగళవారం), జూలై 19వ తేదీల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యమునా నీటి ఉధృతి, వర్షాల కారణంగా ఢిల్లీ కష్టాలు మరోసారి పెరిగే చాన్స్ ఉంది.
Read Also:Vijay Sethupathi : షారుఖ్ ఖాన్ కోసం జవాన్ సినిమాలో నటించాను
ఢిల్లీలో సోమవారం కూడా తేలికపాటి వర్షం కురిసింది. అక్కడ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. నేటి నుండి జూలై 22 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజానికి భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా గంగా యమునా ఇందులో చాలా విధ్వంసం సృష్టించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయి. మీడియా కథనాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీనితో పాటు బద్రీనాథ్ హైవేతో సహా అనేక రహదారులు మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్‌గఢ్ జిల్లాలకు నేటికీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
Read Also:Shankar : ఇండియన్ 2 సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్న దర్శకుడు శంకర్..?
అంతేకాకుండా రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలో బీభత్సం సృష్టించిన యమునా నది ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లోనూ బీభత్సం సృష్టించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాకుండా, హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కులు-మనాలిలో వరదలు బీభత్సం సృష్టించాయి. కులు – మనాలి మధ్య NH నీటి కారణంగా బాగా దెబ్బతింది. దీంతో పాటు వ్యాస్ నదిపై నిర్మించిన పలు వంతెనలు కూడా వరదలో కొట్టుకుపోయాయి.