Site icon NTV Telugu

Chardham Yatra: ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

Chardham

Chardham

ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో ఇప్పటివరకు 60 మంది మరణించగా, 17 మంది గల్లంతయ్యారు.

Read Also: Team India: రోహిత్ శర్మకు ఇంతకు తోడు దొరికేనా..?

ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సంతో కొండ చరియలు విరిగిపడడంతో పాటు.. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఆగస్టు 14, 15 తేదీల్లో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టుగా అధికారులు వివరించారు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో.. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తు్న్నాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశమున్నందున అధికారులు రహదారులను మూసివేశారు.

Read Also: Varun tej- Lavanya: పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జూలైలో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్‌థామ్ యాత్రకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Exit mobile version