Site icon NTV Telugu

Weather warning: పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే!

Weather Alert

Weather Alert

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షంతో పాటు వడగండ్లు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ వార్నింగ్ (Warning) ఇచ్చింది.

 

ఏఏ రాష్ట్రాలంటే..
మార్చి 1 నుంచి 3 వరకు భారీ వర్షాలు (Rainfall) కురుస్తాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో భారీ వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.

అలాగే హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, హర్యానా, చండీగఢ్‌, పంజాబ్‌, పశ్చిమ యూపీలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Exit mobile version