NTV Telugu Site icon

Rain Threat: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!

Ts Rains

Ts Rains

Rain Threat: నార్త్‌ ఇండియాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు సౌత్‌ ఇండియాపై విరుచుకుపడుతున్నాయి.. తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.. అటు వరంగల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సలహా పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు వర్షం విడవకుండా కురుస్తూనే ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ రోజు ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్‌ ఇచ్చింది.

Read Also: Karnataka Crime: నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్

వాతావరణ శాఖ నిన్న మధ్యాహ్నం ఇచ్చిన అప్‌డేటెడ్‌ ప్రకారం అల్లూరి సీతారామరాజు, తీరప్రాంత పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇదే సమయంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు పడతాయని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, అల్లూరి, ఏలూరు, ఎగువ పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది వాతావరణశాఖ. దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్రను అనుకుని స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. నెమ్మదిగా కదులుతూ ఇవాళ రోజంతా భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గాలులు తీవ్రంగా వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది వాతావరణశాఖ.

Show comments