Hyderabad: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయ్యింది. ఆకాశం మేఘావృతమైనది.. పలు ప్రాంతాల్లో వర్షం వాన పడుతుంది. నిన్నటి ( ఆదివారం) వరకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, తాజాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. కొండపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపూరం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: ED: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రకటన..
ఇక, హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ఇవాళ పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టాయి.. ఇక, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్, మొజంజాహి మార్కెట్, కొండపూర్, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉపరితల ద్రోని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలో పలు జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. అలాగే, మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించారు. రాగల నాలుగు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, కొమురం భీం, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈదురు గాలులతో కుడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.