ఈమధ్యకాలంలో భారీవర్షాలు అన్ని ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఉన్నట్టుండి వర్షాలు కురవడం ఆయా నగరాలు, పట్టణాలు జలమయం కావడం జరిగిపోతోంది. బెంగళూరు నగరం భారీ వానతో తల్లడిల్లిపోయింది. ఒక్క రోజులోనే జల విలయంలో అల్లాడిపోయింది. మంగళవారం కురిసిన కుండపోత వానలకు నగరం జలమయమైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వెళ్లేందుకు బోట్లు ఉపయోగించాల్సి వస్తోంది. తాజాగా ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై దొరికిన చేపను చేతిలో పట్టుకోగా, మరొకరు దాన్ని క్లిక్ మనిపిస్తూ కనిపించారు.
తాజా చేపలు కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరంలేదని, బెంగళూరు రోడ్ల మీదికి వస్తే చాలని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. చేపలు కొనాల్సిన పనిలేకుండా బెంగళూరులోని రోడ్లపై కాసేపు చేపల వేట చేయండి.. తాజా చేపలు మీకు లభించడం గ్యారంటీ అంటున్నారు జనం.
గత కొద్దిరోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 820 మిమీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా 27 జిల్లాలు, 187 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. 30 వేలమంది వర్షాల కారణంగా ఇబ్బందుల పాలయ్యారు. వానల వల్ల దాదాపుగా 7647 కోట్ల నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దాంతో అన్ని జలాశయాలు నిండిపోతున్నాయి. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. బెంగళూరు నగరంలో నిన్న ఒక్కరోజు కురిసిన వర్షంతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. రోడ్లు జలమయం కావడంతో ఒక్కో రోడ్డు ఒక్కోకాలువలా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.
Read Also: SSMB 28: మహేష్ సినిమాలో తరుణ్ కాదంట.. ఆ హీరో ఫిక్స్..?
