NTV Telugu Site icon

Heavy Rains: హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

Rains

Rains

Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెంలలో వర్షం కురుస్తుంది.

Read also: Mosambi Juice: ఓరి దీనమ్మ బత్తాయో.. బత్తాయి జ్యూస్‭లో ఇంత మ్యాటర్ ఉందా.?

భాగ్యనగరం హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సికింద్రాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నిన్న ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు.

మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Read also: MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Shiva Parayanam: సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి

Show comments