NTV Telugu Site icon

Heavy Rains: ఇండోర్‌లో వర్ష బీభత్సం.. 200 మందికి పైగా ప్రాణాలను కాపాడిన అధికారులు

Rains

Rains

Heavy Rains: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, హోంగార్డుల సహాయంతో 200 మందికి పైగా ప్రాణాలు రక్షించారని జిల్లా మేజిస్ట్రేట్ ఇళయరాజా తెలిపారు.

Read Also: Godavari Anjireddy: చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆపన్నహస్తం

రౌ తహసీల్‌లోని కలారియా గ్రామంలో వరదల కారణంగా గంభీర్ నదిలోని ఒక ద్వీపంలో చిక్కుకున్న 21 మంది గ్రామస్తులను పడవల ద్వారా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళలు, పిల్లలు, మత్స్యకారులు, రైతులు ఉన్నారు. మరోవైపు ఓ గర్భిణి వర్షంలో చిక్కుకుపోయిందన్న సమాచారం అందుకుని.. వైద్య బృందం లైఫ్ బోట్ ద్వారా గవాల గ్రామానికి చేరుకుని సురక్షితంగా ప్రసవం చేసి తల్లీ బిడ్డను కాపాడారు.

Read Also: IPhone 16 Series Leak : ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఐఫోన్ 15 మించిన అప్‌గ్రేడ్స్..!

శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామీణ ప్రాంతంలో ఉబ్బిన కోరల్ నదిలో ఓ కారు కొట్టుకుపోయిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉమాకాంత్ చౌదరి తెలిపారు. ఈ వాహనంలో రాష్ట్ర మాజీ మంత్రి రంజానా బాఘేల్ కుమారుడు 19 ఏళ్ల యష్‌తో సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారని.. గ్రామస్థుల సహాయంతో పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. కల్వర్టుపై నీరు ప్రవహిస్తున్నప్పటికీ కారును దాటించే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ తెలిపారు.