Site icon NTV Telugu

RCB vs PBKS : భారీ వర్షం.. బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరిగేనా?

Rcb

Rcb

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్-34లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ 7 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ లేట్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పారు. స్టేడియం పరిసరాల్లో చిరు జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్ మరింత ఆలసమయ్యే కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాచ్ టాస్ ఆలస్యమై గంటన్నర కావస్తోంది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

READ MORE: Google: గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం!

సొంత గడ్డలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. లాస్ట్ మ్యాచులో 111 పరుగుల సల్ప లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించిన పంజాబ్ రెట్టింపు ఉత్సాహంతో ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి.. నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. ఆర్సీబీ మూడు, పంజాబ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈరోజు ఏ జట్టు గెలిస్తే అది పాయింట్ల పట్టికలో టాప్-2లో చేరుతుంది.

READ MORE: AP Liquor Scam: లిక్కర్‌ స్కాంపై సిట్‌ ఫోకస్‌.. మరికొన్ని పేర్లు బయటపెట్టిన సాయిరెడ్డి..!

Exit mobile version