Site icon NTV Telugu

Rain In Hydarabad : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

Heavy Rains

Heavy Rains

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం వర్షం కురిసింది. అయితే.. హైదరాబాద్‌ నగరంలో గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి వాతావరణం హీటెక్కిస్తుంది.. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత పలు చోట్ల మబ్బులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొద్దిసేపటికే నగరంలో పలుచోట్ల జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూడిన ఎండాకాల పరిస్థితుల నుంచి స్థానికులకు కొంత ఉపశమనం లభించింది. వాతావరణ సూచన మేరకు రాబోయే రెండు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖాజాగూడ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Also Read : Pareshan Trailer: ‘మసూద’ హీరో మరోసారి మరో క్రేజీ సినిమాతో వచ్చేశాడు

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. భానుడి భగభగను తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికే జంకుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకుపైగా పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు దగ్గరగా చేరాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

Also Read : Viral : ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం.. పోలీస్ జీప్‌పై డ్యాన్స్

Exit mobile version