Site icon NTV Telugu

Weather Alert : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Heavy Rain Alert

Heavy Rain Alert

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులు (30-40 kmph) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లలో వచ్చే ఐదు రోజుల్లో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం , తేలికపాటి నుండి మోస్తరు వర్షం మరియు ఉరుములు మెరుపులు , ఈదురు గాలులు (30-40 kmph) తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని IMD తన సూచనలో తెలిపింది. ఇండిపెండెంట్ వాతావరణ సూచనల ప్రకారం సోమవారం సాయంత్రం నగరంలో వర్షం పడవచ్చు. అయితే.. కోస్తా తీరం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా.. నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది.

Exit mobile version