మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది అని సబ్యసాచి చెప్పారు.
Read Also: Student Suicide: కాలేజీలోని వాష్‌రూమ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం తెలిపాడు. మృతుల బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Baby: మూవీ లవర్స్ కి అలర్ట్.. బేబీ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది..
రాజధాని నగరం ఐజ్వాల్‌కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నారు. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది.