ప్రతిరోజు రైళ్లలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఛార్జీలు తక్కువ, సమయం ఆదా అవుతుంది కాబట్టి, ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణికులు రైలులో ప్రయాణించాల్సి వస్తే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే., మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉండి చివరి నిమిషంలో రద్దు చేయబడతారు. ఈ దశలో, టిక్కెట్ రద్దు కారణంగా రీఫండ్ ప్యాసింజర్ ఖాతాలో జమ కావడానికి చాలా రోజులు పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వే టిక్కెట్ రద్దు కోసం రీఫండ్‌ల శుభవార్త ప్రకటించింది.
Also Read: Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
ఒకవేళ మీ రైలు టికెట్ క్యాన్సిల్ అయినా మీకు రీఫండ్ అందలేదా..? అయితే ఇకపై అలంటి జాప్యానికి తెరపడనున్నది. రైల్వే ప్రయాణీకులకు టికెట్ రద్దుకు సంబంధించిన రీఫండ్‌ల సమస్యను పరిష్కరించడానికి భారతీయ రైల్వే రంగం సిద్ధం చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు తక్షణమే రీఫండ్ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. మీరు మీ ఆన్‌లైన్ టిక్కెట్‌ను రద్దు చేస్తే, మీ వాపసు కేవలం ఆరు గంటలలోపు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం., కేవలం 6 గంటల్లో, 50 % రీఫండ్‌లు రద్దు చేయబడిన ఈ-టిక్కెట్ల ఖాతాలలో జమ చేయబడ్డాయి.
Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..
రద్దు చేయబడిన రైల్వే టిక్కెట్‌లు, టీడీఆర్ క్లెయిమ్‌లలో 98% ఒకేఒక్క రోజులో పరిష్కరించబడ్డాయి. మీ రైలు టికెట్ రద్దు చేయబడితే, మీరు వెయిట్‌లిస్ట్‌లో చేరిన తర్వాత మీ రీఫండ్ ప్రాసెస్ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుండేది. ఈ కారణంగానే రైల్వే శాఖ తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని గమనించడంతో.. కేవలం 6 గంటల్లోగా ఖాతాల్లోకి రీఫండ్ జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కొద్ది గంటల్లోనే టీటీఈలు వెరిఫై చేస్తారని, గంటల వ్యవధిలోనే రీఫండ్‌లు ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.