Rahul Sipligunj: అంగరంగ వైభవంగా జరిగిన రాహుల్ సిప్లిగంజ్–హరిణ్య వివాహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ 27న అంటే నేడు అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Also Read : Kantara – Chapter 1: ‘కాంతారా’ హిందీ OTT రిలీజ్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా?
Also Read
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్‌కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్లో సింగర్‌గా భారీ విజయాలు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఆయన క్రేజ్, ప్రతిభ స్థాయి ప్రపంచానికి చాటి చెప్పింది. కెరీర్ పరంగా అత్యంత బిజీగా ఉన్న రాహుల్, వ్యక్తిగతంగా హరిణ్య తో ప్రేమలో ఉన్న విషయం చాలా కాలంగా ఇండస్ట్రీలో టాక్‌గా ఉంది. హరిణ్య రాజకీయ కుటుంబానికి చెందిన యువతి. గత రెండు నెలల క్రితం ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకుని తమ ప్రేమను అధికారికం ప్రకటించారు.
తాజాగా జరిగిన వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనేలా అత్యంత వైభవంగా నిర్వహించినట్లు సమాచారం. రాహుల్–హరిణ్య వివాహ ఫోటోలు వీరిద్దరూ అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో దర్శనమైన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. కాగా సంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ పెళ్లి ఎంతో అందంగా, పద్ధతి ప్రకారం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే నేటిజన్లు ఈ కొత్త జంట పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వారి ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెహందీ, హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించాయి.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!