NTV Telugu Site icon

Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ

Rahul Sipliganj

Rahul Sipliganj

పక్కా మాస్ అండ్ ఫోక్ సాంగ్స్ లో రాహుల్ సిప్లిగంజ్ గొంతు లేని ప్లే లిస్ట్ అయితే ఉండదు.. మరి రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఒక గాయకునిగానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటుడుగా కనిపించి మెప్పించాడు. అలాగే తాను పాడిన నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా గెలుచుకుంది. అయితే లేటెస్ట్ గా రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఎంట్రీ అంటూ పలు రూమర్స్ వైరల్ అయ్యాయి.

Read Also: Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

అయితే, తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. నవంబర్‌లో నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ మేరకు గాంధీ భవన్‌లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం చేశాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అతడు తేల్చి చెప్పాడు.

Read Also: Brown Bread: బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి.

కాగా, పాతబస్తీకి చెందిన రాహుల్ సిప్లిగంజ్‌కు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్‌లో అతడు పాడిన పలు పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటతో విశ్వవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. అతడి క్రేజ్ ఉపయోగించుకునేందుకు పలు పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గ టిక్కెట్‌ను రాహుల్ సిప్లిగంజ్‌కు కేటాయించిందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు వెళ్తారని ప్రచారం కూడా సాగుతుంది. దీంతో పాపులారిటీ ఉన్న రాహుల్ సిప్లిగంజ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందని న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే, తాను రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను రాహుల్ సిప్లిగంజ్ ట్విట్టర్ వేదికగా ఖండించాడు. తాను కళాకారుడినని, ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే తనకు తెలుసునని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.