NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: జూలై 2న రాహుల్ సభ సక్సెస్ చేస్తాం.. సీఎం కేసీఆర్ కు పొంగులేటి సవాల్..!

Ponguleti

Ponguleti

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై 2వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ సభ కోసం దాదాపు 5 లక్షల మంది ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ జన గర్జన సభకు ఆటంకాలు కలిగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తొందని పొంగులేటి మండిపడ్డారు. సభ కోసం బస్సులు ఇవ్వకుండా ఆ శాఖ మంత్రి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. బస్సులు అద్దెకు అడుగుతున్నా ఇవ్వకుండా.. నీచాతి నీచమైన‌ కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Masala Mirchi Bajji : మసాలా మిర్చి బజ్జిలను ఇలా చెయ్యండి..టేస్ట్ వేరే లెవల్..

ఇది RTC మంత్రి అబ్బ సొమ్ము కాదు.. కేసీఆర్ తండ్రి సొమ్ము కాదని పొంగులేటి అన్నారు. స్వచ్చందంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ సొంత వాహనాల్లో కాంగ్రెస్ జనగర్జన సభకు వస్తామని చెబుతున్నారని.. ఎంత మంది పోలీసులు చెక్ పోస్ట్ లు పెట్టిన సభకు జనం వస్తారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. అయితే సభకు వచ్చే వారిని టెర్రరిస్ట్ ల్లాగా ప్రభుత్వం చూస్తోందన్నారు. అంతేకాకుండా మంత్రి పువ్వాడ పై పొంగులేటి విమర్శల వర్షం కురిపించారు. సభ జరిగే రోజు ఖమ్మంలో శనివారం నుండి ఆదివారం వరకు తాగు నీరు సరఫరా బంద్ చేయమని లోకల్ మంత్రి ఆదేశాలు ఇవ్వడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

Read Also: Polimera 2 Teaser: పొలిమేర టీజర్.. చేతబడితోనే ప్యాంట్ తడిచేలా భయపెట్టేస్తున్నారు కదయ్యా

అంతేకాకుండా సీఎం కేసీఆర్ కు పొంగులేటి సవాల్ విసిరారు. TRS బదులు BRS ఆవిర్భావ సభను ఇక్కడ ఆర్భాటంగా చేసామని చెప్పుకున్నారని.. BRS ఆవిర్భావ సభ కన్నా ఘనంగా తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేస్తామన్నారు. ఒక్క అడుగు కూడా వదలకుండా జూలై 2న రాహుల్ సభను సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Show comments