NTV Telugu Site icon

Rahul Gandhi: సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. నా దారి క్లియర్గానే ఉందంటూ ట్వీట్

Rahul

Rahul

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ పరిణామంపై రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఏది వచ్చినా.. తన కర్తవ్యం ఇలాగే ఉంటుందని, భారత ఆలోచనను రక్షించడమే తన ఆలోచనని.. ట్వీట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు కాకుంటే రేపు అయినా నిజం గెలుస్తుందని తెలిపారు. ఏం జరిగినా నా రూట్ క్లియర్‌గా ఉందన్నారు. తానేం చేయాలి.. తన పనేంటనే విషయంలో క్లారిటీ ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన వారికి, ప్రేమ చూపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Biryani issue: చికెన్ బొక్కలు గట్టిగా ఉన్నాయని గొడవ.. పీఎస్ కు చేరిన బిర్యానీ పంచాయితీ

ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఈ తీర్పుపై స్పందించారు. అటు ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సభా నేత అధిర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ స్పందించగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ తీర్పుపై స్పందించారు. సత్యం ఒకటే గెలుస్తుందని ఖర్గే ట్వీట్ చేయగా.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ వేటాడటం పూర్తిగా బహిర్గతమైందన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు ఆలోచనలను ఆపేయాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.