NTV Telugu Site icon

Congress: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?

Rahul Gandhi

Rahul Gandhi

CWC Meeting: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌గాంధీని ఎన్నుకొనే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ పని చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ నాయకత్వంలో తిరిగి పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Read Also: Maharastra : మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం.. భారీగా పార్టీలు మారనున్న ఎమ్మెల్యేలు

కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కూడా రాహుల్‌ గాంధీ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా ఉంటారు. మోడీ సర్కారు ఏడాదిలోపు పడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఇండియా కూటమి తమ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ని సిద్ధంగా ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది.

Read Also: Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి

ఇక, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు ఢిల్లీలో జరగబోతుంది. అశోకా హోటల్‌లో ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌ సహా కాంగ్రెస్‌ సీఎంలు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా రాహుల్‌ను ప్రతిపాదిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. దాన్ని అనుసరించి, సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సీపీపీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో రాహుల్‌ను లాంఛనప్రాయంగా సీపీపీ నేతగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది.

Read Also: TG Vishwaprasad: పిఠాపురం నుంచే స్వాతంత్ర్యం మొదలైంది!!

అలాగే, రాత్రి 7 గంటలకు అశోకా హోటల్‌లో సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలకు విందు సైతం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ భేటీలో పాల్గొనేందుకు రేవంత్‌ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుం చి ఎంపీలుగా గెలిచిన మల్లురవి, బలరాంనాయక్‌లు రేవంత్‌తో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.