Site icon NTV Telugu

Rahul Gandhi: మోడీ “మన్‌ కీ బాత్‌” వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు..

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా ఇక్కడి ప్రజల ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ హరించిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీకి ‘56 అంగుళాల ఛాతీ’ ఉందని చెప్పడాన్ని మీరు తప్పక చూసి ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్, కాంగ్రెస్ పార్టీలు నరేంద్ర మోడీ సైకాలజీని మార్చేశాయన్నారు.

READ MORE: Jharkhand: బురదలో కూరుకుపోయిన కేంద్రమంత్రి కారు.. నడుచుకుంటూ వెళ్లిన శివరాజ్‌సింగ్

ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారని, ఆయన తన భావాల గురించి మాట్లాడుతారని, కానీ నిరుద్యోగం గురించి మాట్లాడరని రాహుల్ గాంధీ అన్నారు. ముందు దేశంలో నిరుద్యోగాన్ని తొలగించండి.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించండి.. యువతకు దార్శనికత ఇవ్వండి.. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వండి.. ఈ విషయాలపై మోడీ స్పందించాలన్నారు. మోడీ 24 గంటలూ తన మనసులోని మాట(మన్‌ కీ బాత్‌) ను చెబుతూనే ఉంటారని.. కానీ ప్రస్తుతం ఎవరూ ఆయన మాట వినడానికి ఇష్టపడటం లేదన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రాకపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన బహుమతని విమర్శించారు.

Exit mobile version