NTV Telugu Site icon

Telangana Jana Garjana: కాంగ్రెస్ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్: రాహుల్

Rahul

Rahul

Rahul Gandhi Speech At Telangana Jana Garjana Public Meeting: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్‌ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఐడియాలజీ దేశాన్ని కలపడం, ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విభజించడమన్నారు. దేశమంతా భారత్‌ జోడో యాత్రను సమర్థించిందని. జోడో యాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల మనసులో కాంగ్రెస్‌ పార్టీ ఉందని.. అందుకే మీరు కాంగ్రెస్‌ ఆలోచనలు సమర్థించారన్నారు. భట్టి తెలంగాణలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారన్నారు. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు మీరందరు శక్తినిచ్చారన్నారు. తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేదని.. దానిని కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Bhatti Vikramarka: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందే..

ఖమ్మం సభలో ఎన్నికల హామీలను రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ వస్తే రూ.4వేల వృద్ధులు, వితంతువులకు పెన్షన్ ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చేయూత పథకం ద్వారా అందిస్తామన్నారు. ఆదివాసులకు పోడు భూములు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాలే వస్తాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని పారదోలామన్నారు. తెలంగాణలో బీజేపీ ఖతమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్ మధ్యే పోటీ నెలకొంటుందని రాహుల్‌ పేర్కొన్నారు. కర్ణాటక తరహాలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామన్నారు. విపక్ష పార్టీల సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీని పిలవాలని కొన్ని పార్టీలు కోరాయని… కానీ బీఆర్‌ఎస్ వస్తే కాంగ్రెస్ హాజరు కాదని స్పష్టంగా చెప్పామన్నారు. బీఆర్‌ఎస్‌తో కూర్చోమని తేల్చి చెప్పామన్నారు. బీజేపీ బీ టీమ్‌తో కాంగ్రెస్‌కు ఒప్పందం లేదన్నారు.

కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన వారికి తలుపులు తెరిచే ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా ఐడియాలజీ నచ్చిన వారు కాంగ్రెస్‌లోకి రావచ్చొన్నారు. కేసీఆర్‌ అవినీతికి మోడీ అండదండలు ఉన్నాయని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ పని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమేనని ఆయన విమర్శులు గుప్పించారు.

 

Show comments