NTV Telugu Site icon

Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం..

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్‌ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.

Read Also: Patna: రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ..ఏం జరిగిందంటే?

నన్ను దేవుడే పంపించాడంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ మోడీని అడిగితే, నాకేమీ తెలియదు.. నన్ను పంపింది దేవుడే అని చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. మోడీ జీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మానేయండి.. దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దని రాహుల్ గాంధీ తెలిపారు.

Read Also: Ranchi: బార్‌లో మ్యూజిక్ వివాదం.. డీజేను గన్తో కాల్చి చంపిన వ్యక్తి

దేశంలోని యువతకు ఎంత ఉపాధి కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముందుగా బీహార్ యువతకు చెప్పాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడిన మీరు ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని, మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు. మరోవైపు.. ఆర్జేడీ (RJD) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులెవరూ మోడీ ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడేంతగా ప్రధాని భాష స్థాయి పడిపోయిందని అన్నారు.