NTV Telugu Site icon

Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!

Rahe

Rahe

అమేథీలో ఏం జరుగుతోంది. రాహుల్ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? సడన్‌గా నివాసాన్ని ఎందుకు శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చ సాగుతోంది. తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

అమేథీలో రాహుల్‌గాంధీ నివాసాన్ని క్లీన్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాహుల్ పునరాగమనం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే రాహుల్ నివాసాన్ని క్లీన్ చేస్తున్నారని తెలుస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. రాహుల్‌పై సెటైర్లు వేశారు. అమేథీలో మీ బావ కర్చీప్‌ వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అమేథీపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రాహులే అమేథీలో పోటీ చేస్తారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Pragati : గల్లీలో బుల్లెట్ పై ప్రగతి ఆంటీ.. వీడియో వైరల్..

ఇదిలా ఉంటే ఇటీవల ఘజియాబాద్‌లో అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమేథీ పోటీపై పెదవి విప్పలేదు. ఇలాంటి నిర్ణయాలను మా పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకుంటుందని, దానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. దీంతో పోటీపై సానుకూల వాతావరణం కనిపించినట్లుగా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ నివాసం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో పోటీ చేసేందుకే రాహుల్ గాంధీ నివాసం తయారవుతున్నట్లుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇది కూడా చదవండి: Prathipati Pulla Rao: కూటమి రాకకు ప్రజలు ఎదురు చూస్తున్నారు

మే 20న ఐదో దశలో అమేథీలో పోలింగ్ జరగనుంది. ఈ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. అలాంటిది గత ఎన్నికల్లో అమేథీలో భారతీయ జనతా పార్టీకి చెందిన స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో రాహుల్ గాంధీపై విజయం సాధించింది. దీంతో అమేథీలో అనూహ్యంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. కానీ అమేథీపై క్లారిటీ ఇవ్వలేదు. తాజా పరిస్థితులను చూస్తుంటే.. తిరిగి అమేథీలో కూడా రాహుల్ పోటీ చేయొచ్చని సమాచారం.

ఇక ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 17 స్థానాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఎస్పీ అనేక మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలోని మిగిలిన 63 స్థానాలకు పోటీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..

Show comments