Site icon NTV Telugu

Rahul Gandhi: కూలీగా మారిన కాంగ్రెస్ అధినేత.. పొలంలో నాటు వేస్తూ రాహుల్ గాంధీ

Untitled 1 Copy

Untitled 1 Copy

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ రైతుల మధ్యకు చేరుకున్నారు. శనివారం హర్యానాలోని సోనిపట్‌లో వరి నాట్లు వేస్తున్న రైతుల మధ్యకు రాహుల్ గాంధీ వెళ్లారు. రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన రాహుల్, వారితో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ వరి నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..

Read Also:Flexes against Modi: ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ లో ఫ్లెక్సీలు, పోస్టర్లు

శనివారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా హర్యానాలోని సోనిపట్‌లోని బరోడా గ్రామ సమీపంలో పొలంలో వరి నాట్లు వేసిన రైతులపై అతడి కన్ను పడింది. తన కారు ఆపమని చెప్పి దిగి నేరుగా రైతుల వద్దకు వెళ్లాడు. రాహుల్‌ని చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత రైతు ట్రాక్టర్ తీసుకుని వరి నాట్లు కోసం పొలాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత రాహుల్ కూడా రైతుల నుంచి వరి నాట్లు వేసే విధానాన్ని అర్థం చేసుకుని స్వయంగా వారితో కలిసి వరి నాట్లు వేశారు. బరోడాతో పాటు మదీనా గ్రామంలోని రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడుపుతూ వరి నాట్లు వేస్తున్న ఫోటోలను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ షేర్ చేశారు. హర్యానాలోని సోనేపట్‌లో రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రైతుల పొలాల వద్దకు చేరుకుని వారి ఆలోచనలను తెలుసుకునేందుకు శ్రీనివాస్ బీవీ రాశారు.

Exit mobile version