Site icon NTV Telugu

Rahul Gandhi: హైదరాబాద్ పర్యటనకు రాహుల్ గాంధీ.. అధికారిక షెడ్యూల్ ఇదే..!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు రాహుల్ గాంధీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని, అలాగే అంతర్గత సమావేశాలు జరపనున్నారు.

Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్

ఇక సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ జరుగనున్న GOAT ఇండియా టూర్ ఈవెంట్‌లో ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం తోపాటు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం. ఈవెంట్ ముగిసిన అనంతరం రాత్రి 9.15 గంటలకు రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అనంతరం రాత్రి 10.30 కు హైదరాబాదు నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయనున్నారు.

Messi Hyderabad Schedule: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Exit mobile version