Rahul Gandhi: కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారపర్వం జోరుగా సాగుతుంది. నేతలు ర్యాలీలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచార జోరుతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు. వారిలో చాలా మంది ‘రాహుల్, రాహుల్’ నినాదాలు చేస్తూ, బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రోడ్ షోను ప్రారంభించారు.
Read Also: Notice to Sweeper: బ్యాంక్ అకౌంట్ కూడా లేదట.. కానీ రూ.16 కోట్ల రుణం చెల్లించాలని నోటీసులు
రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న వాహనం శివాజీ సర్కిల్, కనకదాస సర్కిల్ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య వీధుల గుండా వెళ్తుండగా.. ప్రజలు కాంగ్రెస్ జెండాలను పట్టుకుని వెంబడించారు. రోడ్ షోలో రాహుల్‌గాంధీ వెంట కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ ఎంబీ పాటిల్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాహుల్‌గాంధీ తన రెండు రోజుల కర్ణాటక పర్యటనను కుడాల సంగమం నుంచి ప్రారంభించారు. అక్కడ ఆయన 12వ శతాబ్దపు కవి, సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఈ రోజు బసవ జయంతిని జరుపుకున్నారు.
దేశ రాజధానిలో తన బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత తన మొదటి బహిరంగ సభలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇతరులను ప్రశ్నించడం చాలా సులభం, కానీ తనను తాను ప్రశ్నించుకోవడం కష్టమని.. బాగల్‌కోట్‌లో జరిగిన బసవ జయంతి వేడుకల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడో అదే చీకటిలో, వెలుగు కూడా ఉద్భవిస్తుందన్నారు. ఆ సమయంలో సమాజంలో చీకటి ఉండేది, అందుకే బసవేశ్వర చీకట్లో వెలుగులాగా కనిపించారన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ వయనాడ్ ఎంపీ శనివారం తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత, నిజం మాట్లాడినందుకు ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మాజీ లోక్‌సభ ఎంపీపై అనర్హత వేటు పడిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది.
#WATCH | Congress leader Rahul Gandhi holds a roadshow in Vijayapura, Karnataka.#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/sptYDmfxb3
— ANI (@ANI) April 23, 2023
