Site icon NTV Telugu

Rahul Gandhi: వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్న రాహుల్‌గాంధీ..

Rahul

Rahul

రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్‌, రాయబరేలి స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో.. ఏ స్థానంలో ఉండాలి.. ఏ స్థానాన్ని వదులేసుకోవాలనే దానిపై సందిగ్థత ఉండేది. తాజాగా.. వయనాడ్ స్థానాన్ని వదిలేసి రాయబరేలి కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. మరోవైపు.. వదిలేసిన వయనాడ్ ఉపఎన్నికలో తన ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

Read Also: Rashmika Mandanna : అబ్బా .. నన్ను ఇక్కడ కూడా వదలరా ..

ఈ నిర్ణయానికి ముందు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరయ్యారు. కాగా.. ఈ సమావేశంలో చర్చించి నేతలతో చర్చించి రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ అనేది కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. ఫిరోజ్‌గాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్సే గెలుస్తోంది. కాబట్టి ఈ స్థానాన్ని రాహుల్ అంటుపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ వయనాడ్ వదులుకోగా.. బైపోల్‌లో వయనాడ్ నుంచి ప్రియాంక రంగంలోకి దిగనుంది.

Read Also: Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్‌.. గంజాయికి సంబంధించి సమాచారమిస్తే నగదు రివార్డు

Exit mobile version