Site icon NTV Telugu

Rahul Gandhi : రాహుల్ గాంధీని బాంబులతో లేపేస్తాం.. కలకలం సృష్టిస్తున్న లేఖ

Rahul

Rahul

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాంబులతో లేపేస్తామంటూ బెదిరింపు లేఖలో హెచ్చరించారు దుండగులు. ప్రస్తుతం ఈ వార్త కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ చేరుకున్నారు. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. జోడో యాత్ర సాగే మార్గంలోని జుని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మిఠాయి దుకాణం వద్ద ఈ బెదిరింపు లేఖను గుర్తించారు. పాదయాత్ర ఇండోర్‌లోకి ప్రవేశించిగానే.. నగర వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడతామని, రాహుల్ తో పాటు మాజీ సీఎం కమల్ నాథ్‌ను చంపుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Read Also: Facebook New Updates : ఫేస్ బుక్ యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.. మీ ప్రొఫైల్ మారుతోంది

స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే, ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. కాగా, నవంబర్ 24న రాహుల్ గాంధీ ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఆకతాయిలు తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నా… పోలీసులు మాత్రం దీనిని లైట్ తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాహుల్ వ్యాఖ్యలను మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బాంబు బెదిరింపు రావడం గమనార్హం వచ్చింది.

Exit mobile version