Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమి సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఇప్పటికే రాష్ట్రంలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బీహార్‌లో ర్యాలీలు నిర్వహించారు. ఆదివారం ఆయన బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ చేపల పెంపకందారులతో సమావేశమయ్యారు.
READ ALSO: Nellore: మైపాడు బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు..!
చెరువులోకి దూకిన రాహుల్ గాంధీ..
సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దూకారు. సాంప్రదాయ చేపల వేట ప్రక్రియలో స్థానిక మత్స్యకారులతో కలిసి ఆయన చేపలను వేటాడారు. వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్ని, కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, తదితరులు కూడా చేపలు పట్టారు. దీనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ చెరువులోకి దిగి, వల వేసి, చేపలు పట్టడాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చూశారు. అనంతరం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదని చెప్పారు. ఇలాంటి ప్రముఖ నాయకుడు మా మధ్యకు వచ్చి మా సంప్రదాయాలను స్వీకరించడం తమకు గర్వకారణమని వారు అన్నారు.
వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ ..
ఈ ప్రత్యేక వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ప్రతిపక్ష నాయకుడు బెగుసరాయ్‌లో చేపలు పట్టారు. మత్స్యకారులతో మాట్లాడి, వారి పని, సవాళ్లు, పోరాటాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో VIP పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సాహ్ని కూడా అక్కడే ఉన్నారు” అని పార్టీ పేర్కొంది. “కరువు కాలంలో (పరిమిత కాలం, 3 నెలలు) మత్స్యకార కుటుంబాలకు కుటుంబానికి రూ.5 వేలు సహాయం అందిస్తామని మహా కూటమి హామీ ఇచ్చిందని పార్టీ పేర్కొంది. మత్స్య బీమా పథకం, మార్కెట్ యాక్సెస్, ప్రతి బ్లాక్‌లో చేపల మార్కెట్లు, శిక్షణా కేంద్రాలు, గ్రాంట్ పథకాలు ఏర్పాటు చేస్తామని, నదులు, చెరువులు స్థిరమైన నీటి రిజర్వాయర్ విధానం కింద పునరుద్ధరించనున్నట్లు తెలిపింది.
READ ALSO: Sheikh Hasina: మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల వెనక ఆ రెండు దేశాల హస్తం’
नेता विपक्ष श्री @RahulGandhi ने बेगूसराय में मछली पकड़ने के साथ ही मछुआरा साथियों से बात कर उनके काम से जुड़ी चुनौतियों और संघर्षों पर चर्चा की।
इस दौरान VIP पार्टी के संस्थापक श्री @sonofmallah भी साथ रहे।
महागठबंधन ने वादा किया है 👇
🔹 मछुआरा परिवारों को लीन पीरियड… pic.twitter.com/SFyr4naMbe
— Congress (@INCIndia) November 2, 2025
