కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. వైశ్య వర్గానికి చెందిన వ్యాపారులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైశ్య వర్గానికి మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.
ఇది కూడా చదవండి: Bangladesh: గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్‌కు బెదిరింపులు.. ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే..!
వైశ్య వ్యాపారుల సమస్యలపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మా వ్యాపారం పతనానికి దగ్గరగా ఉంది.. అంటూ వైశ్య సమాజం నుంచి వచ్చిన ఆవేదన నన్ను తీవ్రంగా కలచివేసింది. నేడు ఇలా నిరాశలో కూరుకుపోవడం ఓ హెచ్చరిక లాంటిది. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిచ్చి.. చిన్న, మధ్యతరహా వ్యాపారులపై అధికారం, జీఎస్టీ వంటి విధానాలతో ప్రభుత్వం భారం మోపుతోంది. ఇది కేవలం విధాన వైఫల్యం మాత్రమే కాదు. ఉత్పత్తి, ఉపాధితో పాటు భారత భవిష్యత్తు పైనా ప్రత్యక్ష దాడి’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Bangladesh: ఉస్మాన్ హాదీని ప్రభుత్వమే చంపింది.. బాధిత సోదరుడు సంచలన ఆరోపణలు
