Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడానికి యత్నించిన వ్యక్తి.. కట్‌చేస్తే…(వీడియో)

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను చేపట్టారు. యాత్రలో భాగంగా 16వ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పూర్ణియలోని రోడ్డు మధ్యలో రాహుల్ గాంధీని ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: ISRO Gaganyaan mission: ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం

నేడు బీహార్‌లోని పూర్ణియా చేరుకున్న రాహుల్.. అక్కడ సుదీర్ఘ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ స్వయంగా బైక్ నడుపుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ ఆయన వెనుక కూర్చున్నారు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని తరిమేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారుతున్నప్పటికీ.. ఇది చాలా తీవ్రమైన భద్రతా లోపంగా భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఒకవేళ రాహుల్‌కు హాని కలిగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అంత కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఆ వ్యక్తి కాంగ్రెస్ అగ్రనేత దగ్గరకు ఎలా వచ్చాడు? ఇంతకీ అతడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version