NTV Telugu Site icon

Rahul Gandhi: బొగ్గు కుంభకోణం చేసిన అదానీ.. అందుకే కరెంట్ రేటు పెరిగింది

New Project (50)

New Project (50)

Rahul Gandhi: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద ఆరోపణ చేశారు. బొగ్గు వ్యాపారంలో గౌతమ్ అదానీ పెద్ద తప్పులు చేశారని రాహుల్ అన్నారు. ఇందులో రూ.32000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. విద్యుత్తు ఖరీదు కావడానికి ఇదే కారణమన్నారు. దీంతో ప్రజల కరెంట్ బిల్లులు అమాంతం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ ఖరీదు కావడంతో అదానీ లాభపడ్డాడని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ నేరుగా అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు.

Read Also:Rathod Bapu Rao: 20న బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తా…21 న కాంగ్రెస్‌లో చేరుతా

ఫైనాన్షియల్ టైమ్స్‌ను ఉటంకిస్తూ రాహుల్ అదానీపై ఈ ఆరోపణ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ కు అన్ని పత్రాలు అందాయని తెలిపారు. బొగ్గు వ్యాపారంలో పెద్ద కుంభకోణం జరిగింది. ఇది తాను చెప్పడం లేదని. లండన్‌లోని ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త అని తెలిపారు. ఇంత జరిగినా అతడి పై విచారణ తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని.. మోడీనే అదానీని కాపాడుతున్నారన్నారు. ఇంతకుముందు 20 వేల కోట్లు అనుకున్నాం.. ఇప్పుడు దానికి 12 వేల కోట్లు కలిపి ఇప్పుడు 32 వేల కోట్లు అవుతుందని రాహుల్ అన్నారు. అంటే అదానీ 32000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అదానీ భారతదేశ ప్రజల జేబుల నుండి సుమారు 12000 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఆయనకి ప్రధాని మోడీ రక్షణ ఉంది. మీరు కరెంటు వాడిన వెంటనే పవర్ బటన్ నొక్కిన వెంటనే అదానీ జేబులో డబ్బు పడుతుందని ఎద్దేవా చేశారు.

Read Also:Scott Edwards: భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్‌లు ఇస్తాం: నెదర్లాండ్స్‌ కెప్టెన్‌