భారతదేశంలోని 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. పూణెలో ‘ఛత్రోన్ కీ గూంజ్’లో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలే దేశానికి అతి పెద్ద సంపద అని, వారిని కుటుంబ పాత్రలకే పరిమితం చేయకూడదని, వారి సొంత కలలను సాకారం చేసుకోవాలని మహిళా విద్యార్థులకు పిలుపునిచ్చారు. తన దృష్టిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సున్నితత్వం, సౌమ్యత, కరుణ, దూరదృష్టి కలిగి ఉంటారని అభిప్రాయపడ్డారు. అందుకే దేశంలోని మహిళలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా దేశానికి అతి పెద్ద సంపద అని తాను ప్రాథమికంగా నమ్ముతున్నట్లు చెప్పారు.
భార్యగా, కూతురిగా, తల్లిగా కనిపించడంలో తప్పేమీ లేదు.. కానీ ఇదే మీ ఏకైక గుర్తింపు కాకూడదన్నారు. మనుస్మృతి ప్రకారం జీవితంలోని వివిధ దశలలో మహిళలను వారి తండ్రులు.. భర్తలు, కుమారుల అధికారం క్రింద ఉంచుతారన్నారు. మహిళ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని ఆ గ్రంథం చెబుతుందని.. ఈ విధానం అవమానకరం అన్నారు. ఆ ఆలోచన మహిళల స్వాతంత్ర్యానికి విరుద్ధమని చెప్పారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా తమను తాము విశ్వసించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Girl Power Ft. Pune. 💪#ChhatronKiGoonj pic.twitter.com/bLPx2Wl5ft
— Rahul Gandhi (@RahulGandhi) August 22, 2026
Dreams, not dowry.
Choices, not chains.
Education, not early marriage.
Dignity, not discrimination.
Freedom, not fear.#ChhatronKiGoonj pic.twitter.com/GyT0zi7gIf— Congress (@INCIndia) August 22, 2026

