DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- డీఎంకే సంస్థాగత వ్యవస్థలో స్టాలిన్ కీలక మార్పులు.
- పలు పార్టీ పదవులకు గరిష్ఠ వయోపరిమితి.
- కీలక పదవుల్లో గరిష్ఠంగా రెండు సార్లే అవకాశం.
- పార్టీకి కొత్త రక్తాన్ని తీసుకురావడమే లక్ష్యంగా డీఎంకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీఎంకే పార్టీ సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన పార్టీ పదవులకు వయో పరిమితితో పాటు గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పదవిలో కొనసాగే నిబంధనలను తీసుకువచ్చారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకువచ్చేందుకే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు డీఎంకే తెలిపింది. చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించడం ద్వారా ఈ మార్పులకు ఆమోదం లభించింది. డీఎంకే ఎంపీ పి విల్సన్ ఈ మార్పుల్ని స్వాగతించారు. పార్టీకి ఇవి సంక్షేమ చర్యలని, దీనివల్ల అందరూ సంతోషిస్తున్నారని తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం, బ్రాంచ్ పార్టీ సెక్రటరీ గరిష్ట వయసు 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. మున్సిపల్, సిటీ, టౌన్ పంచాయతీల వార్డు కార్యదర్శుల వయసు 50 ఏళ్లకు మించకూడదు, టౌన్ పంచాయతీ పార్టీ కార్యదర్శులు, ఏరియా కమిటీ కార్యదర్శులు, సిటీ కమిటీ కార్యదర్శుల వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించారు. జిల్లా పార్టీ కారద్యర్శులకు గరిష్ట వయో పరిమితిని 70 ఏళ్లుగా చెప్పారు. ఈ పదవుల్లో ఏదైనా చేపట్టే వ్యక్తులు గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అనుమతి ఉంటుంది. ఇక గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లోని ప్రతీ ఏరియా కమిటి పరిధిలో సగటున 40,000 మంది ఓటర్లు ఉండేటా నిర్ణయించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో ఏరియా కమిటీ పరిధిలో సగటున 30,000 మంది ఓటర్లు ఉండేలా నిర్మాణాన్ని మార్చారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!