ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మళ్లీ కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR)కి ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.
READ MORE: Delhi: రాహుల్‌గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
‘ఈఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్‌ఫో’ నివేదిక ప్రకారం.. ద్రావిడ్ ఇటీవలే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే మెగా వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అండర్-19 నుంచి ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌తో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ద్రవిడ్‌కు రాజస్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన ఐపీఎల్ 2012( IPL 2012) మరియు 2013లో ఈ టీంకు కెప్టెన్‌గా ఉన్నారు. 2014 మరియు 2015 ఐపీఎల్ సీజన్‌లలో జట్టు డైరెక్టర్, మెంటార్‌గా పనిచేశారు. 2016లో.. ద్రావిడ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)కి మారారు. 2019లో రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల కోచింగ్ పదవీ కాలంలో, ద్రావిడ్ భారత జట్టును టీ20 వరల్డ్ ఫైనల్స్ 2021, 2023, ఓడీఐ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు తీసుకెళ్లారు. జూన్ 29, 2024న రాహుల్ సారథ్యంలో టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. భారత మాజీ బ్యాట్స్‌మెన్ విక్రమ్ రాథోడ్‌ను ద్రవిడ్‌కు సహాయ కోచ్‌గా రాజస్థాన్ రాయల్స్ నియమించే అవకాశం ఉందని క్రిక్‌ఇన్‌ఫో నివేదికలో కూడా పేర్కొన్నారు. భారత మాజీ సెలెక్టర్ అయిన రాథోడ్ 2019లో భారత బ్యాటింగ్ కోచ్ కావడానికి ముందు ఎన్సీఏలో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నారు.