Site icon NTV Telugu

Raghunandan Rao: మేము ఓటు చోరీ చేస్తే ఒవైసీని ఎందుకు గెలిపిస్తాం? రాజీనామా చేసే ధైర్యం ఉందా..?

Raghunandanrao

Raghunandanrao

Raghunandan Rao: వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు.. మీపై మీకు విశ్వాసం ఉంటే శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామా? రాజీనామా చేసే దైర్యం ఉందా? అని పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఓటు చోరీపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఎంపీ తిప్పికొట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… పీసీసీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు.. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ లో చేస్తాం కదా? మేము ఓటు చోరీ చేస్తే మీరెందుకు 8 మంది గెలుస్తారు? అసదుద్దీన్ ను ఎందుకు గెలిపిస్తాం? అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు సైతం రాజీనామా చేస్తామన్నారు. తమకు ఒకే అయిన కొత్త ఓటర్ లిస్ట్ తో మళ్ళీ ఎన్నికలకు వెళ్దామన్నారు. అప్పుడు ఎవరు దమ్ము ఏంటో తేలిపోతుంది కదా? అని తెలిపారు.

READ MORE: వైర్‌లెస్ స్పీకర్లలో స్మార్ట్ ఆడియో సెటప్.. కొత్త TCL Z100 లాంచ్!

కామారెడ్డి డిక్లరేషన్ బీజేపీ నీ అడిగి ఇచ్చారా? అని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. “కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. కాళేశ్వరంపై నిజాయితీగా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ తో యూరియా కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలో ఎందుకు వచ్చింది?” అని ఎంపీ ప్రశ్నించారు.

READ MORE: Dog Bite: కుక్క కరిచిన ఆరు నెలల తర్వాత లక్షణాలు.. ఆ తర్వాత యువకుడికి ఏమైందంటే?

Exit mobile version