Raghunandan Rao : కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో దోచుకున్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు చెప్పారని, చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని కొందరు మంత్రులు భూములు ఎలా కబ్జా పెట్టాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంకర పల్లి మండలం కొండకల్, రామ చంద్ర పురం మండలం వెలిమల గ్రామాల మధ్య కొంత మిగులు ల్యాండ్ ఉందన్నారు. 450 ఎకరాలు ఉంటుంది… 1993 లో అక్కడ ఉండే గిరిజనులు ఆ భూములు లో వ్యవసాయం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని, ఇందులో 170 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రీలకి ఇచ్చిందన్నారు. మిగులు భూమిని వేలిమల గ్రామానికి కేటాయించింది… ఆ భూమి ఎవరి కబ్జా లో ఉంది వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయాలని అనుకున్నారన్నారు రఘునందన్ రావు. ఆ నేత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారని, చివరకు 85 ఎకరాలు మిగిలింది ఆ భూమి నీ గిరిజనులు దున్నుకుంటున్నారన్నారు రఘునందన్ రావు.
Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
అంతేకాకుండా..’Ccla లో అప్పుడు ఉన్న సారే ఇప్పుడు ఉన్నారు… అప్పుడు అటు ఎన్ని సూట్ కేస్ లు ఇచ్చారు… ఇపుడు ఇటు కూడా అన్నే సూట్ కేసు లు ఇచ్చాడు. అరబిందో ఫార్మా నిత్యా నంద రెడ్డి అయన కుటుంబ సభ్యులు ఆ భూమి తమదని క్లెయిమ్ చేసుకుంటున్నారు.. ఆ భూముల్లోకి పోలీస్ లు వెళ్లొద్దని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల 8 న.. అయినా పోలీస్ లు అక్కడకి వెళ్లి గోడలు కట్టిస్తున్నారు… అక్కడ రైతులు పై 17 కేసు లు పెట్టారు… 15 వందల కోట్ల భూములని ఓ పెద్దమనిషి కి కట్ట బెడుతున్నారు… కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల మీద మార్చుకుంటున్నారు..’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!