NTV Telugu Site icon

Rafflesia Flower: ప్రపంచంలోనే అతి పెద్ద అరుదైన పుష్పం..ఎక్కడుందో తెలుసా?

Rafflesia Arnoldii Flower

Rafflesia Arnoldii Flower

ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి.. అందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి.. అయితే కొన్ని పుష్పాలకు ప్రత్యేకతలు ఉంటాయి.. ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్లు ఉండటం మనం వింటూనే ఉంటారు.. దేవదారు వృక్షాలు ఎంతో పొడవుగా ఉంటాయి.. ఇక పూలు పెద్దవే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. చూశారా? అలాంటి పువ్వు ఒకటి ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం.. రాఫ్లేసియా. ఈ అరుదైన పుష్పం ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకుంది.. ఈ పువ్వు చూడటానికి దాని ఎరుపు రెక్కలపై మచ్చలను కలిగి ఉంటుంది.. కుళ్లిన మాంసం వాసన కలిగి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఉనికిలో ఉండకపోవచ్చంటున్నారు పరిశోధకులు.. ఈ పూలు ప్రపంచంలోనె అత్యంత పెద్ద పూలుగా పిలవబడుతున్నాయి.. ఇది పువ్వు యొక్క మారువేషంలో ఉంటుంది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణమండల తీగలపై రాఫ్లేసియా వికసిస్తుంది. ఇండోనేషియా, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో ఈ పువ్వు ఎక్కువగా వికసిస్తుంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ పరిశోధకుల ప్రకారం ఈ పువ్వు జాతులలో ఒకటి అంతరించిపోతున్నట్లు తేలింది.

ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం.. ఈ మొక్కలు అంతరించి పోతున్నాయని తెలిపారు.. 60 శాతం రాఫ్లేసియా జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని మేము అంచనా వేస్తున్నాం’ అని పీర్‌-రివ్యూడ్‌ జర్నల్‌లో పరిశోధకులు పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని అత్యద్భుతమైన కొన్ని పుష్పాలను కాపాడేందుకు మాకు తక్షణమే క్రాస్‌-రీజనల్‌ విధానం అవసరం.. పరిమిత పరిస్థితుల్లో వికసించే ఈ పువ్వు మనుషులు, వాతావరణ మార్పు, పర్యావరణ విధ్వంసంతో అంతరించిపోతుందని పరిశోధకులు తెలిపారు.. ఇకపోతే ఈ మొక్కలను ల్యాబ్ లో పెంచుతున్నట్లు తెలిపారు..