NTV Telugu Site icon

Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్..

Nadal

Nadal

స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజ‌ర్ ఫెద‌ర‌ర్, ఆండీ రాడిక్, లీట‌న్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాద‌ల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు. రఫెల్ నాదల్ 92 ATP సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ నాదల్ ఖాతాలో ఉంది. సింగిల్స్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురిలో ఒకడు నాదల్ ఉన్నాడు. నాదల్.. క్లే కోర్టు పై 81 వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

Read Also: Hyderabad: క్యాబ్‌డ్రైవర్‌కి డిజిటల్ పేమెంట్ చేసిన మహిళ.. ఆమెను ట్రాప్‌చేసి గోవా తీసుకెళ్లి…

గత నెలలో జరిగిన నాదల్ లావర్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా అతని చివరి టోర్నమెంట్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత.. లావర్ కప్ తన తదుపరి టోర్నమెంట్ అని నాదల్ ధృవీకరించాడు. టూర్‌లో 2024 తన చివరి సంవత్సరం అని నాదల్ గతంలో సూచించాడు. ఈ సీజన్‌లో నాదల్ రికార్డు 12-7గా ఉంది. అతను చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. అక్కడ నాదల్ రెండవ రౌండ్‌లో జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.

Read Also: Stock Market: ఒక్కరోజు నష్టాల్లోంచి.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్

న‌వంబ‌ర్‌లో మ‌ల‌గాలో జ‌రుగ‌బోయే డేవిస్ క‌ప్‌లో స్పెయిన్ త‌ర‌ఫున చివ‌రిసారి ఆడుతానని నాదల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నిజం చెప్పాలంటే.. గ‌త కొన్నేళ్ళు చాలా క‌ష్టంగా గ‌డిచాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త రెండేళ్లు ఎన్నో బాధ‌లు ప‌డ్డాను. ఎంతో ఇష్టమైన ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం ఎంతో క‌ష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో స‌మ‌యం ప‌ట్టింది. అయితే.. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Show comments