Caesium-137: తప్పినపోయిన క్యాప్సూల్ దొరికింది.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caesium-137: అది ఒక చిన్న క్యాప్సుల్.. దాని పరిమాణం 6 మిల్లిమీటర్ల వ్యాసం, 8 మిల్లిమీటర్ల పొడవు మాత్రమే. కానీ, అది ఏకంగా ఆస్ట్రేలియా అధికారుల్నే హడలెత్తించింది. ఇన్నాళ్లూ ఈ క్యాప్సుల్ పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతంలోని ఒక సైట్‌లో ఉండేది. ఇటీవల దానన్ని ఆ సైట్ నుంచి పెర్త్‌కు రవాణా చేస్తుండగా.. మార్గమధ్యంలో పడిపోయింది. కానీ.. ఎక్కడ పడిపోయిందని తెలీదు. ఈ క్యాప్సుల్ పోయిందన్న విషయం తెలుసుకున్న అధికారులు.. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సరిగ్గా ఎక్కడ పడిందో తెలీదు కాబట్టి.. దాన్ని ఏ సైట్ నుంచైతే తీసుకెళ్లారో, అక్కడి నుంచి పెర్త్ దాకా గాలించారు. అంటే.. ఓవరాల్‌గా 1400 కిలోమీటర్ల మేర వెతుకులాట కొనసాగించారు.
Read Also:TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ రేట్లలో డిస్కౌంట్
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ఎట్టకేలకు రేడియేషన్ డిటెక్టర్ల ద్వారా ఆ గుళికను గుర్తించినట్లు ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది. రోడ్డుకు రెండు మీటర్ల దూరంలో ఆ క్యాపూల్స్ ఉన్నట్లు పసికట్టారు. ఒకవేళ సీసియం క్యాప్సూల్‌కు ఎక్స్‌పోజ్ అయితే.. అది గంటలో 10 ఎక్సరేలకు సమానమైన రేడియేషన్ విడుదల చేస్తుందని హెల్త్ ఆఫీసర్ ఆండ్రూ రాబర్ట్‌సన్ తెలిపారు. ట్రక్కులో తీసుకువెళ్తున్న సమయంలో.. ఆ ట్రక్కు బోట్లు ఊడిపోవడం వల్ల.. క్యాప్సూల్ ఉన్న పరికరం కింద పడినట్లు భావిస్తున్నారు.
Read Also:Four Day Work Week: వారానికి నాలుగురోజుల పని సక్సెస్.. ఉద్యోగులు హ్యాపీ.. పెరిగిన ఉత్పాదకత

ఆ చిన్న క్యాప్సుల్‌లో అంతటి ప్రమాదకరమైనది ఏముందనేగా మీ సందేహం? ‘సీజియం- 137’ అనే రేడియో ధార్మికత పదార్థం అందులో ఉంది. ఆ క్యాప్సుల్‌ని తాకినా, కనీసం దాన్ని దగ్గరగా ఉంచుకున్నా.. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఒకవేళ దాన్ని తాకితే.. వెంటనే గాయాలు అవుతాయని, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. అందుకే.. అలాంటి వస్తువు ఏమైనా కనిపిస్తే, దానికి దూరంగా ఉండాల్సిందిగా వాళ్లు సూచించారు. కాగా.. సీజియం- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు.
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!