Site icon NTV Telugu

Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధిక పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు.. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి..

Radhika

Radhika

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కాల్చి చంపాడు. టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను తండ్రి గన్ తో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు. కాగా రాధిక పోస్ట్ మార్టం నివేదిక బయటకు రాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధిక ఛాతీపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని వెల్లడైంది. కానీ పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుడు వెనుక నుంచి మూడు బుల్లెట్లను కాల్చాడని తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి సర్జన్, బోర్డు సభ్యుడు డాక్టర్ దీపక్ మాథుర్, రాధికపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని, ఆమె ఛాతీపై బుల్లెట్ గుర్తులు కనిపించాయని ధృవీకరించారు. శరీరం నుంచి అన్ని బుల్లెట్లను తొలగించి ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపినట్లు డాక్టర్ మాథుర్ తెలిపారు.

Also Read:Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..

అయితే పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం నిందితుడు చెప్పినదానికి, పోస్టుమార్టం నివేదికకు మధ్య తేడా ఎందుకు ఉందనేది ప్రశ్నగా మారింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, రాధిక తండ్రి అయిన నిందితుడు దీపక్ యాదవ్, తాను రాధికను వెనుక నుంచి కాల్చానని స్వయంగా అంగీకరించాడు. కానీ పోస్టుమార్టం నివేదిక ప్రకారం అన్ని బుల్లెట్లు ముందు నుంచి పేలాయని తేలింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:Job Notifications: జాబ్ లేదని ఇంట్లో వాళ్లు తిడుతున్నారా?.. 18 వేల గవర్నమెంట్ జాబ్స్ రెడీ.. కొడితే లైఫ్ సెట్

25 ఏళ్ల టెన్నిస్ స్టార్ రాధిక యాదవ్ గురువారం ఉదయం తన సొంత తండ్రి చేతిలో హత్యకు గురైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితుడు దీపక్ యాదవ్ గ్రామస్తుల సూటిపోటి మాటలతో కలత చెందాడు. రాధిక నిర్వహిస్తున్న టెన్నిస్ అకాడమీపై అతనికి అభ్యంతరాలు ఉన్నాయి. అకాడమీని మూసివేయమని తన కుమార్తెను చాలాసార్లు కోరాడు. కానీ రాధిక నిరాకరించింది. రాధిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ఆమె ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలనే కోరిక కూడా ఆమె తండ్రికి నచ్చలేదని తెలుస్తోంది. ఈ విషయంపై తలెత్తిన వివాదం రాధికపై కాల్పులు జరపడానికి కారణమైంది.

Exit mobile version