సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల వల్ల దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కేవలం డబ్బు అవసరం కోసమే ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కానీ ఆ సెట్స్‌లో తనకు ఎదురైన అనుభవాలు చాలా భయంకరంగా ఉండేవని’ ఆమె పేర్కొన్నారు.
Also Read : MSVG: టీజర్ కూడా రాకుండానే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ బుకింగ్స్ షురూ!
మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో తాను ఒక్కరే అమ్మాయి ఉండేదాన్నని, కనీసం తన వ్యక్తిగత సిబ్బందిని కూడా లోపలికి అనుమతించేవారు కాదని రాధిక చెప్పారు. సెట్‌లో తన శరీరం గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారని, చెస్ట్ ప్యాడింగ్ వాడమని ఒత్తిడి చేసేవారని, ఆ సమయంలో తాను ఎంతో అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు.. “నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను, కానీ ఆ రోజుల గురించి తలచుకుంటే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది” అని ఆమె ఎమోషనల్ అయ్యారు. కేవలం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లోని కొందరు పెద్ద మనుషుల నిజస్వరూపాలు కూడా తనకు తెలుసని, వారి పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారని రాధిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
