Tamannaah Bhatia: తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు!
- తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్
- కథ లేకపోయినా ఫర్వాలేదు
- క్షమాపణలు చెప్పిన నటుడు పార్తిబన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు.
‘సినీ పరిశ్రమకు చెందిన వారందరిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. నా మాటలు ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి’ అని రాధాకృష్ణన్ పార్తిబన్ అన్నారు. కోలీవుడ్‌లో చాలా సినిమాల్లో పార్తిబన్ నటించారు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన ముద్ర వేశారు. తెలుగులో రచ్చ సినిమాలో ఆయన నటించారు. పార్తిబన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిన్జ్’ జులై 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మొదటి భారత సెలబ్రిటీగా!
టిన్జ్ సక్సెస్ కార్యక్రమంలో పార్తిబన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథ ఉందా? లేదా? అన్నది చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది’ అన్నారు. తమిళంలో హిట్ అయిన జైలర్, బాక్ చిత్రాలను ఉద్దేశించే పార్తిబన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలో తమన్నా డాన్స్ ఇరగదీసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే పాటలతో భారీ హైప్ వచ్చింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!