NTV Telugu Site icon

Tamannaah Bhatia: తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్‌ నటుడు!

Tamannaah Dance

Tamannaah Dance

Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్‌ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్‌ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్‌ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు పార్తిబన్‌ క్షమాపణలు చెప్పారు.

‘సినీ పరిశ్రమకు చెందిన వారందరిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. నా మాటలు ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి’ అని రాధాకృష్ణన్ పార్తిబన్‌ అన్నారు. కోలీవుడ్‌లో చాలా సినిమాల్లో పార్తిబన్‌ నటించారు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన ముద్ర వేశారు. తెలుగులో రచ్చ సినిమాలో ఆయన నటించారు. పార్తిబన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిన్జ్‌’ జులై 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

Also Read: Ram Charan: రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం.. మొదటి భారత సెలబ్రిటీగా!

టిన్జ్‌ సక్సెస్‌ కార్యక్రమంలో పార్తిబన్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథ ఉందా? లేదా? అన్నది చూడటం లేదు. హీరోయిన్‌ డ్యాన్స్‌ కోసమే చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా సినిమా హిట్‌ అవుతుంది’ అన్నారు. తమిళంలో హిట్ అయిన జైలర్‌, బాక్‌ చిత్రాలను ఉద్దేశించే పార్తిబన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలో తమన్నా డాన్స్ ఇరగదీసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే పాటలతో భారీ హైప్ వచ్చింది.

Show comments