NTV Telugu Site icon

IND vs NZ: ఏం పట్టింది భయ్యా.. గాల్లోకి డైవ్ చేసి మరీ (వీడియో)

Radha

Radha

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హ్యాలీడే కొట్టిన షాట్‌ను వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది. ఇటు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది.

Read Also: YouTuber Couple Found Dead: యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి..

ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్‌ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్‌ వెనక్కి పరిగెత్తుతూ పక్షిలా గాల్లోకి ఎగిరి పట్టుకుంది. ఈ క్రమంలో ప్రియా మిశ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ సాధించింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో రాధ మొత్తం రెండు క్యాచ్‌లు పట్టింది. 16వ ఓవర్‌లో దీప్తి శర్మ వేసిన బౌలింగ్‌లో జార్జియా ప్లిమ్మర్ (41) క్యాచ్ అందుకుంది. ప్లిమ్మర్ ఆన్ సైడ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించగా.. రాధ డైవ్ చేసి క్యాచ్ పట్టింది.

Read Also: S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..

కాగా.. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టుకు శుభారంభం లభించింది. సుజీ బేట్స్ (58), ప్లిమ్మర్‌లు తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ సోఫీ డివైన్ 79 పరుగులతో, మ్యాడీ గ్రీన్ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 259/9 స్కోరు చేసింది. భారత బౌలర్లలో రాధ నాలుగు, దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్ చెరో వికెట్ తీశారు.